Site icon NTV Telugu

Eswatini Royal Family: ఆ రాజుకు ప్రతి ఏడాది ఓ కొత్త భార్య.. ఇప్పటికే 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు.. ఆయన ఎవరో తెలుసా!

King Mswati Iii

King Mswati Iii

Eswatini Royal Family: ఆ రాజుకు 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు. దీనికే ఆశ్చర్యపోకండి.. ఆ రాజు వాళ్ల తండ్రికి ఏకంగా 125 మంది భార్యలు, 210 మందికిపైగా పిల్లలు, వెయ్యి మందికిపైగా మనవరాళ్లు. ప్రస్తుతం ఈ రాజు కథ వైరల్‌గా మారింది. ఎందుకు అనుకుంటున్నారు.. మనోడు జూలైలో అబుదాబి విమానాశ్రయానికి వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తి కొంతమంది మహిళలతో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే వారందరూ ఒక ప్రైవేట్ జెట్‌లో వచ్చారు. ఈ ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఆఫ్రికా రాజు.. ఆయన ఆఫ్రికా దేశం అయిన ఎస్వాటిని (గతంలో స్వాజిలాండ్)ను పాలిస్తున్న రాజు మస్వాతి III. ఇంతకీ మనోడి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Srisailam: తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రాజు రాకతో భయాందోళనకు గురైన విమానాశ్రయం..
రాజు అంటే మామూలుగా ఉండదు కదా.. అబుదాబి విమానాశ్రయం (యూఏఈ)లో మస్వాతీ III అడుగు పెట్టడంతో అక్కడ హడావిడి మామూలుగా లేదు. జూలై 10, 2025న రాజు మస్వాతీ తన ప్రైవేట్ జెట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అడుగుపెట్టారు. ఆయనతో పాటు 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, దాదాపు 100 మంది సేవకులు విమానాశ్రయానికి వచ్చారు. ఒక్కసారిగా ఇంత పెద్ద కాన్వాయ్‌ను చూసిన తర్వాత విమానాశ్రయంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది మూడు టెర్మినల్స్‌ను మూసివేసి, విమానాశ్రయంలో వర్చువల్ లాక్‌డౌన్ విధించారు.

యూఏఈకి ఎందుకు వచ్చారు అంటే..
రాజు మస్వతి III యూఏఈని వారి దేశ ఆర్థిక ఒప్పందాలను చర్చించడానికి సందర్శించారు. అయితే ప్రస్తుతం ఆ రాజు రాచరిక జీవితం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజు సాంప్రదాయ చిరుతపులి-ముద్రిత వస్త్రాన్ని ధరించి, తన 30 మంది భార్యలతో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 100 మంది సేవకుల బృందం రాజు, రాణి వార్లను అనుసరిస్తున్నట్లు ఉన్న దృశ్యాలు హైలెట్‌గా మారాయి. ప్రస్తుతం రాజు జీవనశైలిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్వాటిని అని పిలుస్తు్న్న దేశం ఒకప్పుడు స్వాజిలాండ్ పేరుతో ఆఫ్రికాలో ఉండేది. ఆ దేశ రాజు ఎంస్వాటి III కి 30 మంది భార్యలు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆయన తండ్రికి ఏకంగా 125 మంది భార్యలు, 210 మందికి పైగా పిల్లలు, దాదాపు 1,000 మంది మనవరాళ్ళు ఉన్నారు.

రాజు అధికారంలోకి ఎప్పుడు వచ్చారంటే..
రాజు మస్వతి III దేశంలో 1986 నుంచి అధికారంలో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన చక్రవర్తులలో ఆయన ఒకరు. ఆయన సంపద $1 బిలియన్లకు పైగా ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆయనకు 15 మంది భార్యలు, 35 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ప్రతి ఏడాది “రీడ్ డ్యాన్స్” వేడుక సందర్భంగా ఆయన కొత్త వధువును ఎంచుకుంటారు. ఆయన సంపద పెరిగిపోతున్న ఆ దేశంలో మాత్రం పేదరికం దినదినం పెరిగిపోతుంది. దేశ జనాభాలో దాదాపుగా 60% మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడు దేశంలో రాజు విలాసవంతమైన ఖర్చుపై వ్యతిరేకత పెరుగుతోంది.

READ ALSO: LCD డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 6 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్లతో Samsung Galaxy A07 4G లాంచ్

Exit mobile version