NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్లో కల్తీ వైన్ తయారీ ముఠా అరెస్ట్..

Fake Wine

Fake Wine

హైదరాబాద్లో కల్తీ వైన్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళా వద్ద నుంచి 90 కల్తీ వైన్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ గృహిణిగా గుర్తించారు. తన ఇంట్లో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా.. రహస్యంగా ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్, రెండు లీటర్ల బాటలలో నింపి విక్రయిస్తోంది. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో.. 112 బాటిల్లలో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. దాంతో పాటు.. వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిల్స్ ను సీజ్ చేశారు.

Read Also: Rahul Dravid: ఐపీఎల్ టీంకి మెంటర్‌గా రాహుల్ ద్రవిడ్..

ఈ కేసుపై ఎన్టీవీతో ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. లాలాగూడలో కల్తీ వైన్ తయారు చేస్తున్న ఆంగ్లో ఇండియన్ మహిళ అరెస్ట్ చేసామన్నారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో కల్తీ వైన్ తయారీ చేసి విక్రయిస్తుందని తెలిపారు. మహిళను అరెస్ట్ చేసి 90 లీటర్లు 112 కల్తీ వైన్ బాటిల్స్ సీజ్ చేశామన్నారు. తన ఇంట్లో కొంత కాలంగా ఎక్సైజ్ అనుమతులు లేకుండా.. రహస్యంగా కుళ్ళిపోయిన పదార్థాలతో కల్తీ వైన్ తయారు చేస్తుంది.. ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్, రెండు లీటర్ల బాటలలో నింపి తెలిసిన వారికి విక్రయిస్తుందని తెలిపారు. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. దీంతో తెల్లవారుజాము ఎక్సైజ్ అధికారులు, తమ టీం ఆకస్మిక దాడులు చేసామన్నారు. 3 లక్షల రూపాయలు విలువ చేసే 112 బాటిల్స్ లో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ సీజ్ చేశామని తెలిపారు. వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిల్స్ సీజ్ చేసామని.. గతంలోను కల్తీ వైన్ తయారు చేస్తూ ఈమె సోదరుడు అరెస్ట్ అయ్యాడు.. ఇప్పుడు మహిళను అరెస్ట్ చేసామని తెలిపారు.