Site icon NTV Telugu

Tamil Nadu: వీరప్పన్ ఎన్కౌంటర్లో భాగమైన పోలీస్ సస్పెండ్.. రిటైర్మెంట్కు ఒక్క రోజు ముందే..!

Tamilnadu

Tamilnadu

Tamil Nadu: 2004లో అటవీ దొంగ వీరప్పన్‌ను హతమార్చిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ADSP) వెల్లదురై అతని పదవీ విరమణకు ఒక రోజు ముందు సస్పెండ్ అయ్యారు. 2013లో మెరీనాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ‘అయోధ్యకుప్పం’ వీరమణిని హతమార్చిన కేసులో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెల్లదురై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌గా కెరీర్‌ ప్రారంభించి.. అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ADSP) వరకు వెళ్లారు. ఇక, వెల్లదురై పై సస్పెన్షన్ వేటు వేయొద్దని స్టేట్ డీజీపీ, చీఫ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (హెచ్‌ఓపిఎఫ్) శంకర్ జీవాల్ సిఫార్సు చేసినప్పటికీ.. రాష్ట్ర హోం శాఖ సెస్పెండ్ చేస్తున్నట్లు ఆర్డర్‌ను పాస్ చేసింది.

Read Also: Ponguleti Srinivasa Reddy: పాలేరుకు సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే..

ఇక, అవరంగడు రైల్వేస్టేషన్‌ సమీపంలోని తిరుప్పచెట్టి నివాసి పి. సురేష్‌ నుంచి కుమార్‌ రూ.500 దోచుకున్నట్లు పోలీసులకు తెలిపారు. స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ దురై సింగం నేతృత్వంలో పోలీసులు కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. దీంతో కుమార్ పోలీసులపై కొడవలితో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో గుంతలో పడి అతడి కాళ్లు విరిగిపోవడంతో గాయాలయ్యాయి. ఆ తర్వాత మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే కుమార్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక, కుమార్ కేసును CB-CID దర్యాప్తు చేసింది. ఈ కేసులో విచారణ అధికారి ఎస్. గీత 2023లో సంబంధిత కోర్టు ముందు తన తుది నివేదికను సమర్పించింది.

Exit mobile version