ఆదోని పట్టణంలోని 34 వ వార్డు సచివాలయ మహిళ పోలీసుగా దివ్య (26) విధులు నిర్వహిస్తోంది. కాగా దివ్య ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ కాన్పు కావడంతో అనారోగ్యానికి గురైంది. 15 రోజులు గడవకముందే దివ్య ప్రాణాలు కోల్పోయింది. దివ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే దివ్య మృతికి బదిలీల కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరగడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read:Regina Cassandra : సొగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న రెజీనా కాసాండ్రా
బదిలీల కౌన్సెలింగ్ ఉండటంతో శనివారం ఉదయం 8.30కు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కారులో వెళ్లారు. కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండడంతో త్వరగా పంపాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని దివ్య తండ్రి తిరుమల శ్రీనివాసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిందని.. ఆస్పరి మండలం హలిగేర గ్రామ సచివాలయానికి బదిలీ అయిందన్నారు.
Also Read:Iran: వారిద్దరూ దేవుని శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుకు ఇరాన్ మతాధికారి ఫత్వా జారీ
ఇంటికి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు చేరుకున్నామని తెలిపారు. ఉదయం 7 గంటలకు దివ్య తనకు ఆయాసంగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని హైదరాబాద్ కు గాని, కర్నూల్ కు గాని తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే దివ్య మృతిచెందిందని వైద్యులు తెలిపారని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.
