NTV Telugu Site icon

Akkineni Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్యలు.. నాగార్జున పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

Nagarjuna Konda Surekha

Nagarjuna Konda Surekha

Akkineni Nagarjuna : అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ ఆమె మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు. అయితే.. నాగార్జున, నాగచైతన్య కలిసి సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని.. అది నచ్చకే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుందంటూ కొండా సురేఖ ఆరోపణలు చేయటం సర్వత్రా సంచలనంగా మారింది. ఈ విషయంపై అటు ఇండస్ట్రీ ప్రముఖులంతా విరుచుకుపడుతుండగా.. అటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ పరిణమాలతో కొండా సురేఖ కాస్త వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.

Read Also:Swag Movie Review: స్వాగ్ మూవీ రివ్యూ..శ్రీవిష్ణు హిట్ కొట్టాడా?

కాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు గురువారం నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నాగార్జున పిటిష‌న్ పై శుక్రవారం న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టాల్సి ఉండ‌గా వాయిదా ప‌డింది. న్యాయ‌మూర్తి సెల‌వులో ఉండ‌డంతో విచార‌ణ సోమ‌వారానికి వాయిదా వేశారు. నాగార్జున పిటిష‌న్ పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టనున్నారు.

Read Also:Patnam Mahender Reddy: నా ఫామ్ హౌజ్ పక్కనే సబితా, పొంగులేటి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి..

తాజాగా నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదన్నారు. కుటుంబ స‌భ్యుడిగా, సినీ వ‌ర్గాల్లో స‌భ్యుడిగా తాను మౌనంగా ఉండ‌న‌ని… ఇది ఎంత మాత్రం క్షమించ‌రానిద‌ని అన్నారు.