యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ‘బ్యాచ్‌లర్’ మూవీ తో హీరో గా మంచి పేరు తెచ్చుకున్నారు . ఆయన హీరోగా నటించిన సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘అడియే’ ఈ సినిమా లో గౌరీ జి.కిషన్ హీరోయిన్ గా నటించింది.. సైంటిఫిక్ రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 29 న సోనీలివ్ వేదిక గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.. అయితే ఈ సినిమా పై సినీ ప్రియుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆ ఓటీటీ సంస్థ నేటి సాయంత్రం నుంచే ‘అడియే’మూవీ స్ట్రీమింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.దీనితో ముందు అనుకున్న తేదీ కంటే ముందుగానే ‘అడియే’ మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా తమిళంతోపాటు, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమా కథ విషయానికి వస్తే… జీవా (జీవీ ప్రకాశ్) స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే సెంథాళినితో ప్రేమలో పడతాడు.సంవత్సరాలు గడుస్తున్నా తన ప్రేమను మాత్రం ఆమెతో చెప్పలేకపోతాడు.ఈ క్రమంలోనే ఆమె ఓ ఫేమస్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తన ప్రేమను ఆమెకు ఎలా అయినా చెప్పాలని జీవా ఎన్నో కలలు కంటుంటాడు.ఊహించని విధంగా అతడు ఓసారి మరో ప్రపంచంలోకి వెళ్తాడు. అక్కడ జీవా కూడా గాయకుడిగా మంచి పేరు తెచ్చుకుని, సెంథాళినిని వివాహం చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటాడు.. కొన్ని రోజుల తర్వాత అతడు ఆ కొత్త ప్రపంచం నుంచి వాస్తవంలోకి వస్తాడు . సెంథాళిని ప్రేమను పొందాలని జీవా ఏం చేశాడు.. ఆమె ప్రేమను పొందడా లేదా…అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.