NTV Telugu Site icon

Adikeshava OTT Release: ఆదికేశవ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..ఎప్పుడూ స్ట్రీమింగ్?

Aadhikesava

Aadhikesava

వైష్ణవ్ తేజ్, శ్రీలీలా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ… తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. డిసెంబర్ ఆఖర్లో ఆదికేశవ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.. యాక్షన్ బాగానే ఉన్నా.. కథ రొటీన్‍గా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఓ ఫార్మాట్‍లో సినిమా సాగిందని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్ శ్రీలీల హైలైట్‍గా నిలిచారు. రెండు వేరియషన్స్ ఉన్న పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ కూడా మెప్పించారు.. సినిమాలోని కొన్ని సీన్ల పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి..

ఈ సినిమాలో జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, అపర్ణా దాస్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు… ఉప్పెన సినిమా తర్వాత సరైన హిట్ లేని వైష్ణవ్ ఈ చిత్రంతో మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు… కలెక్షన్స్ వీకెండ్ లో భారీగా పెరుగుతుందేమో చూడాలి..