Site icon NTV Telugu

Adhipurush : ఆదిపురుష్ లో శూర్ఫణఖ గా చేసిన నటి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Tejeswini Pandit

Tejeswini Pandit

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆదిపురుష్ సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.. జూన్ 16 ణ ఈ సినిమా విడుదల అయ్యింది.. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు.. ఒకవైపు విమర్శలు అందుకుంటున్నా కూడా మరోవైపు పాజిటివ్ టాక్ ను కూడా అందుకుంటుంది.. రాముడిగా ప్రభాస్ నటన ఆడియన్స్ మర్చిపోలేని విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో ఇతర పాత్రల గురించి ఇప్పటి వరకూ పెద్దగా తెలియకపోవచ్చు. కాని సినిమా రిలీజ్ తరువాత.. ఇందులోని కొన్ని పాత్రల గురించి ప్రముఖంగా చర్చించేకుంటున్నారు ఆడియన్స్ అందులో ఒకటి శూర్ఫణఖ పాత్ర ఒకటి..

ఇంతకీ ఆమె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఆమె పేరు తేజస్విని పండిట్. ఆదిపురుష్ మూవీ ఎంతో క్రూరంగా కనిపించిన తేజస్విని పండిట్ రియల్ లైఫ్ లో స్టార్ హీరోయిన్. మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది…ఇక మరాఠా చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. 2004లో అగా బాయి అరేచా అనే తో మారాఠి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదిటి సినిమా లోనె నెగిటివ్ షేడ్స్ ఉన్న కథానాయికగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది…

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది.. ఇక ఆదిపురుష్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది..ఆదిపురుష్ కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంది…తొలిరోజే ఏకంగా రూ.140 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ప్రపంచంలోనే రికార్డ్ క్రియేట్ చేసింది సినిమా. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వస్తోంది. ఓవైపు అద్భుతంగా ఉందని.. నెక్ట్స్ జనరేషన్ రామాయణం అని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం దర్శకుడు పొరపాటు చేశాడని.. తన ఇష్టానుసారం రామాయణాన్ని తెరకెక్కించాడని వాదిస్తున్నారు.. టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతుంది ఆదిపురుష్. ఇక ఈ వీకెండ్‏లో ఎక్కువగానే వసూళ్లు రానున్నాయన అంచనా.. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇక చివరికి ఎంత రాబడుతుందో చూడాలి..

Exit mobile version