Site icon NTV Telugu

Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..

Shambala

Shambala

Shambala Day 1 Collection: హీరో ఆది సాయి కుమార్ కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘శంబాల’ నిలిచింది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ల నుంచి మొదలైన పాజిటివ్ టాక్ డే వన్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించింది. ప్రస్తుతం ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా షోలు, స్క్రీన్‌లు పెరుగుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

READ ALSO: Health Tips: ఈ పని చేస్తే మీ జుట్టు రాలదు..

ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమా యూనిట్ తమ కంటెంట్ మీదున్న నమ్మకంతో రిలీజ్‌కు రెండ్రోజుల ముందు నుంచీ ప్రీమియర్లు వేస్తూ వచ్చారు. అలా వేసిన ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం, డే వన్‌కి అది మరింతగా పెరగడంతో అన్ని చోట్లా షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతోన్న ఈ మూవీ డే వన్ ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు ఈ చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సక్సెస్‌లో ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ కీ రోల్స్ పోషించాయి. ఆది సాయి కుమార్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోందని ఆడియెన్స్ చెబుతున్నారు.

READ ALSO: Prasanna Kumar: ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉంది: నిర్మాత ప్రసన్న కుమార్

Exit mobile version