NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్యం కార్యదర్శిగా ఉన్న ఎన్ యువరాజ్‌కు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను సర్కారు అప్పగించింది. ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీగా ఉన్న మనజీర్ జిలానీ సమూన్‌కు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా ఉన్న ఎస్ రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిష్ట్రేటర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ కె దినేష్ కుమార్‌కు రియల్ టైం గవర్నెన్స్ సోసైటీ సీఈవోగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1626 ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.

Read Also: AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం