Women Rule: చాలా దేశాలలో కొందరు మహిళలను బానిసలుగా చూస్తారని తెలుసు. అక్కడ జీవించే మహిళలకు వారి ప్రాథమిక హక్కులు కూడా నిరాకరిస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగాయి కానీ పురుషులపై కాదు. కానీ ఒక వింతైన దేశం గురించి మీకు చెబితే నమ్ముతారా? ఆ దేశంలో కేవలం మహిళలు మాత్రమే పరిపాలిస్తారని ఊహించుకోగలరా. వాస్తవానికి ప్రపంచంలో స్త్రీలు పురుషులను పరిపాలించి వారిని బానిసలుగా ఉంచుకునే దేశం ఉంది. ఈ దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Meenakshi Chaudhary: నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను: మీనాక్షి చౌదరి
ఆ దేశం పేరు..
ప్రపంచంలో మహిళలు పరిపాలిస్తూ, పురుషులను బానిసలుగా చేసుకున్న దేశం చెక్ రిపబ్లిక్. ఈ దేశానికి సొంత జెండా, కరెన్సీ, పాస్‌పోర్ట్, పోలీసు దళం కూడా ఉన్నాయి. ఈ దేశంలో అసలు పౌరులు పురుషులు కాదు, మహిళలు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ దేశంలో పురుషులను బానిసలుగా చూస్తారు. ఈ దేశాన్ని అదర్ వరల్డ్ కింగ్‌డమ్ అని పిలుస్తారు. ఈ దేశం1996లో ఏర్పడింది. ఈ దేశాన్ని క్వీన్ ప్యాట్రిసియా I పాలిస్తుంది. అయితే ఇతర దేశాలు దీనిని ఒక దేశంగా గుర్తించలేదు. ఈ దేశంలో ఏదైనా చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంటే, అలా చేసే అధికారం క్వీన్ ప్యాట్రిసియా I కి మాత్రమే ఉంది. ఈ దేశంలో స్త్రీలను పురుషుల కంటే ఉన్నతంగా భావిస్తారు. పురుషులు స్త్రీలను కచ్చితంగా గౌరవించాలి. ఈ దేశంలో ఉన్న పురుషులు వారి స్త్రీ యజమాని అనుమతి లేకుండా తినకూడదు, తాగకూడదు. ఇదండీ ఈ దేశం కథ.
READ ALSO: Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ చూశారా!
