NTV Telugu Site icon

Adani Group MCap: అదానీ పై పెరిగిన నమ్మకం.. కంపెనీల్లో పెరిగిన పెట్టుబడులు

Adani

Adani

Adani Group MCap: అదానీ గ్రూప్ షేర్లపై ఇన్వెస్టర్ల విశ్వాసం మళ్లీ పెరిగింది. ప్రస్తుత మార్కెట్ గణాంకాలు కూడా అదే సూచిస్తున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.11 లక్షల కోట్లు దాటింది. దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర కొనుగోళ్ల కారణంగా కంపెనీ షేర్లు మద్దతు పొందుతున్నాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఎన్డీటీవీ ఉన్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో గ్రూప్‌లోని 10 షేర్లలో 6 పెరుగుదల కనిపించగా 4 షేర్ల ధరలు స్వల్పంగా తగ్గాయి.

Read Also:G20 Dinner Menu: జీ20 డిన్నర్‌లో భారతీయ రుచులు.. వంటకాల పూర్తి జాబితా ఇదే

అదానీ పవర్ నేతృత్వంలో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ షేర్ల మంచి పనితీరు కనబరిచాయి. దీని షేరు ధర 3 శాతం పెరిగింది. అదానీ పవర్ షేర్లు పనితీరులో పెరుగుదల నిరంతరంగా కొనసాగుతోంది. అదానీ పవర్ షేర్ ధర ప్రస్తుతం పది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. షేర్ల ధరలలో నిరంతర పెరుగుదల అదానీ గ్రూప్ ఎమ్‌కాప్‌కు సహాయపడింది. ఒక రోజు ముందుగా అంటే గురువారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత, అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం రూ. 10 లక్షల 96 వేల కోట్లుగా ఉంది. ఇది శుక్రవారం వ్యాపారం ముగిసిన తర్వాత రూ. 11 లక్షల కోట్లకు పెరిగింది. అదానీ గ్రూప్ కంపెనీల ఎంక్యాప్ ఒక్కరోజులో దాదాపు రూ.7,039 కోట్లు పెరిగింది.

Read Also:African Union: జీ-20 సమావేశాల్లో కీలక పరిణామం.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

అదానీ గ్రూప్ షేర్లకు ఈ ఏడాది కలిసి రాలేదు. సంవత్సరం ప్రారంభంలో హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దాదాపు నెల రోజుల పాటు అదానీ గ్రూప్ షేర్లలో ప్రతిరోజూ భారీ పతనం జరిగింది. దీని కారణంగా మార్చి 2023 ప్రారంభంలో అదానీ గ్రూప్ ఎమ్‌క్యాప్ దాదాపు రూ.5 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత అదానీ షేర్లు మంచి రికవరీని కనబరిచాయి. వాటి విలువ ఇప్పుడు తక్కువ స్థాయితో పోలిస్తే రెండింతలు పెరిగింది.

Show comments