NTV Telugu Site icon

Actress Sukanya: విడాకులు తీసుకున్నా.. తను నా కూతురు కాదు!

Actress Sukanya

Actress Sukanya

Actress Sukanya Gives A Clarity on Rumored Daughter: 1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పుదు నెల్లు పుదు నాత్తు’ అనే తమిళ చిత్రం ద్వారా సుకన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అసలు పేరు ఆర్తీ దేవి కాగా.. సినిమాల కోసం సుకన్యగా పేరు మార్చుకున్నారు. భారతీరాజా ఆమె పేరును మార్చారు. చిన్న కౌంటర్, కొత్తవాసల్, సెంటమిల్ పటు, వాల్టర్ వెట్రివేల్, కరుపు వెల్లి, తాళతు, కెప్టెన్, వండిచోలై సిన్రాసు, మహానటి, మిస్టర్ మద్రాస్, మహాప్రభు, భారతీయుడు వంటి పలు సూపర్ హిట్ చిత్రాలలో ఆమె నటించారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో సుకన్య సినిమాలు చేశారు.

ఒకప్పుడు ఎంతో ఫేమ్‌ ఉన్న సుకన్య.. కొంతకాలంగా వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పొత్తికై టీవీలో ప్రసారమయ్యే ‘శక్తి ఐపీఎస్ సీరియల్ ద్వారా స్మాల్ స్క్రీన్‌కి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకన్య.. తన కుటుంబం గురించి మాట్లాడారు. సుకన్య కూతురంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒక యువతి ఫోటో వైరల్‌ అవుతుంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్తతో విడిపోయిన సుకన్యకు ఇంత పెద్ద కూతురు ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ అంశం గురించి సుకన్య స్పందించారు. ఆ అమ్మాయి తన కూతురు కాదని, తన చెల్లెలి కూతురు అని స్పష్టం చేశారు.

Also Read: Actress Hema: పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా.. బెంగళూరు సీసీబీ సీరియస్!

‘నేను కూడా ఆ ఫోటో చూశాను. తాను నా కూతురు కాదు, నా చెల్లెలి కూతురు. ఆ ఫోటోను నా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాను. నేను, నా సోదరి మరియు ఆమె కుమార్తె అని పేర్కొన్నాను. అయినా నా కూతురు అంటూ నెట్టింట వైరల్ అయింది. శ్రీధర్ రాజగోపాల్‌ని నేను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మేము కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నాము. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. విడాకులకు చాలా సంవత్సరాలు పట్టింది. అయితే ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నది నా కూతురే అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. సుకన్య గురించి ఏదో ఒక వార్త ప్రచారం చేయడానికే ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. నా చెల్లెలు కూతురు ఈ వార్త చూసి.. పెద్దమ్మ వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చిందని ఇంట్లో వాళ్లతో చెబుతుంది’ అని సుకన్య తెలిపారు.

 

Show comments