Site icon NTV Telugu

Chiranjeevi-Suhasini: గన్‌తో వాళ్లను బెదిరించారు.. రియల్‌ లైఫ్‌లో కూడా చిరంజీవి హీరోనే: సుహాసిని

Chiranjeevi Suhasini

Chiranjeevi Suhasini

Suhasini Praises Chiranjeevi: వెండితెరపై కొన్ని జోడీలు ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి వాటిలో చిరంజీవి, సుహాసిని జంట ఒకటి. 1980-1990ల్లో వీళ్లిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబోలో ఛాలెంజ్, ఆరాధన, మంచిదొంగ, కిరాతకుడు, రాక్షసుడు, మరణ మృదంగం, మగ మహారాజు, చంటబ్బాయి లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, సుహాసిని కో-స్టార్స్ మాత్రమే కాదు.. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడా. తాజాగా చిరంజీవి తనను పోకిరీల నుంచి కాపాడిన ఓ సంఘటనను సుహాసిని గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా చిరు హీరోనే అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: HMD Skyline Price: హెచ్‌ఎండీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్‌ చేసుకోవచ్చు!

చిరంజీవితో సుహాసిని వీడియో కాల్‌లో మాట్లాడారు. ‘చిరంజీవి నా హీరో. మీకు ఓ విషయం చెప్పాలి. ఒకసారి మేం షూటింగ్‌ కోసం కేరళలోని ఆగ్రపల్లికి వెళ్లాం. ముందు కారులో మీరు వెళ్తున్నారు. వెనక కారులో నేను, డ్యాన్స్‌ మాస్టర్ తార, హెయిర్‌ డ్రెస్సర్‌ ఉన్నాం. కొందరు తాగుబోతులు మా కారుపై బీరు బాటిల్స్‌ వేశారు’ గుర్తుందా అని చిరంజీవిని సుహాసిని అడిగారు. ‘ఆ నాకు గుర్తుంది. నేను కారు దిగి వాళ్లను గన్‌తో బెదిరించారు. వాళ్లంతా అక్కడినుంచి పారిపోయారు’ అని చిరు చెప్పారు. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా చిరంజీవి హీరోనే అని సుహాసిని పేర్కొన్నారు.

Exit mobile version