Site icon NTV Telugu

Shraddha Arya : బేబీ బంప్ తో జనాలకు సడన్ షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్

New Project (77)

New Project (77)

Shraddha Arya : ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా ఒకప్పటి టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. అందం, అభినయం ఉన్నా స్టార్ హీరోయిన్ గా ఎందుకు పేరు సంపాదించలేకపోయింది? చివరికి ఈ క్యూటీ కూడా ఇతర హీరోయిన్లలానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె శ్రద్దా ఆర్యా, ఆమె మూడేళ్ల క్రితం నేవీ అధికారిని వివాహమాడింది.

Read Also:Rahul Gandhi: దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు

2007లో గొడవ సినిమాతో తొలిసారిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రద్ధా ఆర్య.. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన తర్వాత రోమియో, కోతి మాక తదితర చిత్రాల్లో నటించింది. 2006లో తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో నిశ్శబ్ద అనే చిత్రంలో నటించిన శ్రద్ధా ఆర్య తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ పలు సీరియల్స్‌లో నటించింది. డ్రీమ్ గర్ల్, కుండలి భాగ్య వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ క్యూటీ.
Read Also:Inspirational Story : అప్పుడు వీధిలో అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు డాక్టర్..!

శ్రద్ధా ఆర్య నవంబర్ 2021 లో రాహుల్ నాగల్ అనే నేవీ అధికారిని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె త్వరలో ఒక మగబిడ్డకు జన్మనివ్వబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధా ఆర్య.. గర్భవతిగా ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రద్ధా ఆర్య గులాబీ రంగు చీరలో యువతను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అభిమానులు ముందుగానే అభినందనలు తెలుపగా మరికొందరు షాక్ అయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version