NTV Telugu Site icon

Actress Pragathi Viral Video: నిజంగానే ఆ పని చేసేంది.. టార్గెట్ పెద్దదే..

Pragathi

Pragathi

తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తల్లి, అత్త, కూతురు, చెల్లెలు ఇలా అన్ని పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది… ఓవైపు నటిగా ఎంటర్‪టైన్ చేస్తూనే మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్‌తో బాగా పాపులర్ అయింది. అవన్నీ సరదాగా చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టేసింది..

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్‪గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది కానీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. అలా అలా కొన్నాళ్లకు సినిమాల్లో పలు పాత్రల్లో చేసే అవకాశాలు వచ్చాయి..

సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘బాబీ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రగతి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. లాక్‌డౌన్ టైంలో ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. అయితే అవన్నీ సరదాకి అనుకున్నారు. ఇప్పుడు నిజంగానే పవర్ లిఫ్టర్ గా మారిపోయి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. అయితే టార్గెట్ చాలా పెద్దదే. దాన్ని చేరేవరకు తగ్గేదే లే అంటుంది ప్రగతి.. మొత్తానికి ఇలా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది..