Site icon NTV Telugu

Aiswarya Rai : ఐశ్వర్య రాయ్ పై నటి కస్తూరి సంచలన ఆరోపణలు.. అలా అనేసిందేంటి?

Whatsapp Image 2024 05 23 At 9.09.26 Am

Whatsapp Image 2024 05 23 At 9.09.26 Am

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కేన్స్ ఫెస్టివల్ గురించే పెద్ద చర్చ జరుగుతుంది.. ఆ ఫెస్టివల్ కు హీరోయిన్లు వెరైటీ దుస్తులలో దర్శనం ఇచ్చారు.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు ఉన్నారు.. అందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు.. ఆమె చేతికి గాయం అయినా కూడా వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన డ్రెస్సులను ధరించి అందరి మనసు దోచుకుంది.. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి నటి కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది.. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ లో ఈసారి సౌత్ ఇండియన్ తారల సందడి చేయడం విశేషం.. గత 19 ఏళ్ల గా ఈ ఫెస్టివల్ కు ఐశ్వర్య రాయ్ హాజరువుతూ సందడి చేస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో వచ్చి ఆకట్టుకుంది.. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రముఖులు.

ఇరవై ఏళ్ల ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం అందరూ కలిసి.ఈ ఏడాది కూడా రెగ్యులర్‌గా హాజరయ్యే ఐశ్వర్య తన కూతురుతో కలిసి కనిపించింది.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్య రాయ్ పై నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రపంచంలోని అత్యంత అందమైన స్త్రీలను కూడా కాలం విడిచిపెట్టదు.
ఐశ్వర్యరాయ్ గడియారాన్ని వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందంగానే ఉండేది. కానీ ప్లాస్టిక్ ఆమె కలకాలం అందాన్ని నాశనం చేసింది.. కాలంతో పాటే అన్ని మారతాయి అన్నట్లు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.. ఈ పోస్ట్ తో కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది..

Exit mobile version