Site icon NTV Telugu

Kajal Aggarwal : చందమామ కాజల్ కు చేదు అనుభవం..తాకరాని చోట తాకిన అభిమాని..

Whatsapp Image 2024 03 06 At 8.49.29 Pm

Whatsapp Image 2024 03 06 At 8.49.29 Pm

టాలీవుడ్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే పలు ఈవెంట్స్ మరియు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటారు.. అయితే పబ్లిక్ లో అభిమానులతో తీరుతో కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే వున్నాయి.వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటం సాధారణంగా జరిగే విషయమే… కానీ అందులో కొందరు ఆకతాయిలు విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాజల్ తో ఓ అభిమాని అభ్యంతరకంగా వ్యవహరించారు.చూట్టూ బౌన్సర్లు ఉన్న కూడా అతడు కాజల్ ని తాకరాని చోట తాకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో ఓ ఫ్యాషన్ వస్త్ర షోరూంను ఒపెనింగ్ కి కాజల్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా కాజల్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్ మాల్ ప్రారంభించిన కాజల్ మాల్ ని వీక్షించింది. అనంతరం షాపింగ్ మాల్ నిర్వహకులతో ముచ్చటించిన ఆమె అభిమానులకు సెల్ఫీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాజల్ల్ తో ఫొటో దిగేందుకు వచ్చిన ఓ వ్యక్తి కాజల్ నడుముపై చేయి వేశాడు. దీంతో షాకైన కాజల్ ఏంటిది అంటూ సీరియస్ అయ్యింది. దీంతో బౌన్సర్లు అతడిని దూరంగా జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే గతంలో కూడా కాజల్ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇలాగే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను ఓ వ్యక్తి తాకరాని చోట తాకిన సంఘటన అప్పట్లో సంచలనమైంది. తాజాగా మరోసారి కాజల్ కి ఇలాంటి చేదు సంఘటనే ఎదురవడంతో కాజల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Exit mobile version