నటీమణి హేమ గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టవడం తో పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో తాజాగా బెంగళూరు హైకోర్టు ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను పూర్తిగా కొట్టివేసింది. ఈ శుభవార్తను హేమ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read : Sholay Bike: IFFI గోవాలోప్రత్యేక ఆకర్షణగా షోలే బైక్ ..
‘ఇటీవల మా అమ్మ చనిపోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ బాధ లోనే ఉండగా. ఇలాంటి టైమ్‌లో బెంగళూరు హైకోర్టు నా మీదున్న కేసును కొటేసింది. నవంబర్ 3న జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ కాపీ వచ్చే వరకు చెప్పొద్దని అన్నారు. అందుకే చెప్పలేదు. ఈ గ్యాప్‌లో మా అమ్మకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది. మీడియా, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల అమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే ఆలోచిస్తూ బాధపడ్డారు. చెప్పాలంటే ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపాయి. అంటూ హేమ తన బాధను వ్యక్తం చేసింది. ‘ మా అమ్మే నా బలం.. నా ధైర్యం. నాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను అమ్మ తట్టుకోలేకపోయింది. నాపై తప్పుడు వార్తలు ఆమెను బాగా కృంగదీశాయి. నేను ఫేక్ న్యూస్ ప్రచారం చేయోద్దని వేడుకున్నా వినలేదు. నన్ను రెగ్యులర్‌గా ట్రోల్ చేస్తూనే ఉన్నారు అని ఎమోషనల్ అయ్యింది. కానీ నేను నిర్దోషిని ఏ తప్పూ చేయలేదు అని ఇప్పటికైన రుజువైంది అంది చాలు అని అన్నారు హేమ.
