NTV Telugu Site icon

Aparna Das Marriage: గ్రాండ్‌గా యంగ్ హీరోయిన్ హల్దీ వేడుక.. ఫొటోస్ వైరల్!

Aparna Das Marriage

Aparna Das Marriage

Aparna Das Ready to Marry Deepak Parambol on April 24: మలయాళీ ముద్దుగుమ్మ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. నటుడు దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) అపర్ణ, దీపక్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. హల్దీ వేడుకల్లో అపర్ణ హాఫ్ శారీలో మెరిశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2018లో ‘న్యాన్ ప్రకాషన్’ సినిమాతో అపర్ణ దాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదా మూవీతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న అపర్ణ.. దళపతి విజయ్ బీస్ట్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ప్రస్తుతం అపర్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణ సినిమాల మీద మక్కువతో ఇటు వైపు వచ్చారు.

Also Read: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌!

కెరీర్ ఊపందుకునే సమయంలోనే 28 ఏళ్ల అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. ‘ముంజుమ్మల్ బాయ్స్’తో పాటు పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. అపర్ణ, దీపక్ కలిసి మనోకరం మూవీలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని సమాచారం. వీరి వివాహనికి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. పెళ్లితో ఒక్కటి కాబోతున్న దీపక్, అపర్ణ జంటకు నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Show comments