Site icon NTV Telugu

Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

Amani

Amani

టాలీవుడ్‌లో హోమ్లీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చినా తాను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘స్టాలిన్’ సినిమాలో ఒక కీలక పాత్రను ఆమె వదులుకున్న వైనం చర్చనీయాంశమైంది.

ఆమని మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా డ్రీమ్ హీరో. ఆయన పక్కన ఒక్క సినిమా అయినా హీరోయిన్‌గా చేయాలని ఎంతో ఆశపడ్డాను. అయితే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలి పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ నా డ్రీమ్ హీరోను అన్నయ్యగా ఊహించుకోవడం నా వల్ల కాలేదు. అందుకే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను . హీరోయిన్‌గా ఆయన్ని ఎంతో ఆరాధించాను. అప్పట్లో ఆ ఛాన్స్ రాకపోవడం నా దురదృష్టం. కనీసం ఇప్పటికైనా ఆయన సరసన ఒక మంచి పాత్రలో కనిపించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’ అని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.

Exit mobile version