తమిళ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో జరిగిన ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
Read Also: Anantham Teaser: లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ట్రీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్
2026 ఎన్నికల్లో సింగిల్‌గానే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని విజయ్ తెలిపారు. కానీ.. తమతో పాటు ఎవరైనా రావడానికి వస్తే మాత్రం కచ్చితంగా కలిసే వారితో పాటు ఎన్నికలకు వెళ్తామని అన్నారు. విజయ్ ఎవడికి భయపడడు.. ఎవరెవరి పేర్లు చెప్పుకొని రాజకీయం చేయాల్సిన అవసరం విజయ్‌కు లేదన్నారు. రాజకీయాల్లో ఒక మంచి పార్టీగా గుర్తింపు పొందడానికి తాను పనిచేస్తానని తెలిపారు. కుట్రలు చేయడానికి, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడటానికి, బూతులు తిట్టుకోవడానికి తాను రాజకీయ పార్టీ పెట్టలేదని పేర్కొన్నారు. సిద్ధాంతాల పరంగాను, ఐడియాలజీ పరంగాను ఎవరైనా తనతో విభజించవచ్చు.. కుట్రలో చేయొచ్చని విజయ్ అన్నారు. అలాంటి వారితో డీసెంట్ అప్రోచ్, డీసెంట్ ఎటాక్ ఉంటుందని తెలిపారు. అది మాత్రం చాలా లోతుగానే చేస్తామని చెప్పారు. డబ్బులు దోచుకోవడానికి అధికారాన్ని అడ్డగోలుగా వాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజల కోసం ప్రజల కోరిక మేరకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఒక ఆశయం కోసం పక్క ప్లాన్ తో వచ్చాను... ఇక వెనక్కి వెనక్కి తిరిగి చూసేది లేదని విజయ్ పేర్కొన్నారు.
Read Also: Udhayanidhi: దళపతి విజయ్‌కి ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు..
భారత ఎన్నికల సంఘం సెప్టెంబర్ 8న తమిళగ వెట్రి కళగంను రాజకీయ పార్టీగా అధికారింగా నమోదు చేసింది. రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఆగష్టు 22న తమిళగ వెట్రి కళగం(టీవీకే) జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు విజయ్. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయాల్లోకి వచ్చారు.