Site icon NTV Telugu

Superstar Krishna : కత్తిపోటు లేకుండా కృష్ణ గారి సినిమా మార్నింగ్ షో పడదు :శివాజీ

Superstar Krishna Records, Actor Sivaj

Superstar Krishna Records, Actor Sivaj

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సాహసానికి మారుపేరు’గా నిలిచిన సూపర్‌స్టార్ కృష్ణ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే ఓపెనింగ్స్, థియేటర్ల వద్ద జరిగే హంగామా అప్పట్లో ఒక సంచలనం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ,సూపర్ స్టార్ మాస్ ఫాలోయింగ్‌ను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

Also Read : Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!

శివాజీ మాట్లాడుతూ.. ‘అప్పట్లో కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల వద్ద వాతావరణం వేరేలా ఉండేది. టిక్కెట్ల కోసం జరిగే తోపులాటలో కత్తిపోట్లు జరిగేవి. అంటే ఆయనకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాలకు ఉండే ఓపెనింగ్ డే ఫుట్‌ఫాల్స్ (Opening Day Footfalls) ఇప్పటికీ ఏ హీరోకి కూడా ఉండవు. అది కృష్ణ గారు సృష్టించిన లెగసీ’ అని కొనియాడారు. అప్పట్లో వందల సంఖ్యలో సినిమాలు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన కృష్ణ రికార్డులను ఇప్పటి తరం హీరోలు అందుకోవడం కష్టమని శివాజీ అభిప్రాయపడ్డారు. సూపర్‌స్టార్ కృష్ణ టెక్నాలజీ పరంగానే కాకుండా, మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఇక ప్రజంట్ శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను కృష్ణ అభిమానులు.. మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గర్వంగా షేర్ చేస్తున్నారు.

Exit mobile version