NTV Telugu Site icon

Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు

Sharwanand

Sharwanand

Sharwanand Engagement: ప్రముఖ నటుడు శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. శర్వానంద్ రక్షితారెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రక్షితారెడ్డిని శర్వానంద్ త్వరలోనే పెళ్లాడనున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ యువ జంట నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన తదితరులు హాజరయ్యారు. శర్వానంద్, రక్షిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది.

Mass Maharaja Raviteja: ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

పెళ్లి తేదీ, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటిస్తారు. ఇక శర్వానంద్ నిశ్చితార్థం ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శర్వానంద్ త్వరలోనే కృష్ణ చైతన్య దర్శకత్వం వహించే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయిక. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో ప్రకటిస్తారు.

 

Show comments