Parthiban: తమిళ నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం.. ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం అప్లై!

Parthiban

Parthiban

Parthiban: తమిళ విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో, దానికి ముగింపు పలకడమే కాకుండా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. తనకి ఏ కులం, మతం లేదని చాటిచెప్పే ‘నో కాస్ట్ – నో రిలీజియన్ సర్టిఫికెట్’ కోసం ఆయన అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు.

READ ALSO: April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

అసలేం జరిగిందంటే..
‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలో విలన్‌గా నటించిన పార్తిబన్, ఈ సినిమా ఈవెంట్‌లో తనను తాను పరిచయం చేసుకుంటూ తన సామాజిక వర్గం (కులం) పేరును ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మేధావిగా పేరున్న పార్తిబన్ కులం పేరు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. తాజా పరిణామాలపై శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన పార్తిబన్, ఆ వివాదంపై స్పష్టతనిచ్చారు. “నేను కులమతాలను అస్సలు పట్టించుకోను. వేదికపై నా మాతృభాష తెలుగు అని చెప్పబోయి, పొరపాటున సామాజిక వర్గం పేరును వాడాను. అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు” అని వివరించారు. నెటిజన్ల విమర్శలు తనను ఎంతో బాధించాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కులం, మతం లేదని ధృవీకరించే సర్టిఫికెట్ తీసుకోవచ్చనే విషయం తనకు ఇప్పుడే తెలిసిందని, వెంటనే దానికి అప్లై చేశానని పార్తిబన్ వెల్లడించారు. “ఈ సర్టిఫికెట్ అందుకున్న తొలి సినీ నటుడిని నేనే అవుతాను. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కులమతాలకు అతీతమైన సమాజం కోసం దీనిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తాను” అని ఆయన ప్రకటించారు.

READ ALSO: Congress Star Campaigners: ఎన్నికల కురుక్షేత్రం షురూ.. పుదుచ్చేరి టూ అస్సాం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!