Crime News:పలుకేసుల్లో నిందితుడిని విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకెళ్లే పోలీసులపై బాంబు వేసి పరాయ్యాడు.తిరిగి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతగాడి కోసం గాలింపే చేపట్టారు. ఈ ఘటన కేరళలోజరిగింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులపై బాంబు విసిరిన కేసులో నిందితుడు షఫీక్‌ను అరెస్టు చేశారు.ఆర్యనాడులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో దాక్కుని ఉండగా పట్టుకున్నారు.ఉదయం ఆ ఇంటి కుటుంబీకులు రాగానే షఫీక్ వారిపై దాడి చేశాడు.ఇంటి యజమాని తలపై రాయితో కొట్టి బావిలో పడేశాడు.ఆపై గొడవ విన్న స్థానికులు షఫీక్‌ను పోలీసులకు అప్పగించారు.అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అబిన్ పారిపోయాడు.
Read Also: Corona Spray : ఒక్కసారి పీల్చితే .. మీరు రమ్మన్నా కరోనా రాదు
ఇంటి యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.బావిలో పడిన అతడిని స్థానికులు బయటకు తీసుకొచ్చారు.షఫీక్ పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు.కనియాపురంలో యువకుడి అపహరణ ఘటనపై విచారణకు వచ్చిన పోలీసులపై దాడి జరిగింది.షఫీక్‌పై రెండుసార్లు బాంబు విసిరినట్లు సమాచారం.
Read Also: SBI Loan: పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ
ఘటన అనంతరం పరారీలో ఉన్న షఫీక్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మంగళూరు పోలీసులు త్వరలో ఆర్యనాడు పోలీసుల నుంచి నిందితులను అదుపులోకి తీసుకోనున్నారు.గత బుధవారం, 11 మంది గ్యాంగ్‌స్టర్ల బృందం నిఖిల్ నెర్బర్ట్‌ను పుత్తన్‌తోప్ నుండి అపహరించి బాంబు విసిరారు.ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు.ఈ కేసులో మరో నిందితుడు, షఫీక్ సోదరుడు షమీర్.. ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆసుపత్రిలో చేరాడు.