Road Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: శుక్రవారం అర్థరాత్రి గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై.. వ్యాన్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
జీరో పాయింట్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని రబూపురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఎకో వ్యాన్ నంబర్ DL 3 CC 7136ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. వ్యాన్‌లో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం జెవార్‌లోని కైలాష్ ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్‌లో ఉన్న వారంతా ఢిల్లీ నుంచి జార్ఖండ్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. గ్రేటర్ నోయిడా నుంచి జేవార్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల పంచనామా నమోదు చేసిన అనంతరం పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
చనిపోయిన వారు..
1- ఉపేంద్ర బైతా (38).
2- బిజేంద్ర బైతా (36).
3-కాంతి దేవి (30)
4-కువ్ జ్యోతి (12)
5- సురేష్ (45).
గాయపడిన వారి పేర్లు
1- సూరజ్ (16).
2- ఆయుష్ (08).
3- ఆర్యన్ (10).
Read Also:Singareni: సింగరేణి కార్మికులకు దసరా సంబురాలు.. ఒక్కొక్కరికి 1.53 లక్షలు జమ..
తాజావార్తలు
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!