Site icon NTV Telugu

Accenture Layoffs: అసలేం జరుగుతోంది.. మూడు నెలల్లో 11,000 ఉద్యోగులను తొలగింపు.. త్వరలో మరికొందరు కూడా?

Accenture

Accenture

Accenture Layoffs: యాక్సెంచర్‌ (Accenture) సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కేవలం మూడు నెలల్లోనే 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలిగించడమే.. ఈ ఉద్యోగాల కోత వచ్చే ఏడాది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియను సంస్థ “పునర్నిర్మాణ కార్యక్రమం”గా పేర్కొంటోంది.

Vidadala Rajini: వైసీపీ డిజిటల్ బుక్‌ యాప్‌లోనే.. మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు!

ఈ విషయమై యాక్సెంచర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. భవిష్యత్తులో AI కీలక పాత్ర పోషించనుందని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సంస్థ కోరుకుంటోంది. ఒకవేళ ఉద్యోగులు త్వరగా నైపుణ్యాలను పెంచుకోలేకపోతే, వారిని తొలగించడం తప్పనిసరి అని తెలిపారు. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మొదటి ప్రాధాన్యత అయినప్పటికీ, అది సాధ్యం కాని చోట ఉద్యోగాల తొలగింపు తప్పదని ఆమె స్పష్టం చేశారు. కంపెనీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమం కోసం 865 మిలియన్ డాలర్లు (7,669 కోట్లు) ఖర్చు చేయనుంది. గత త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పునర్నిర్మాణంతో సంస్థకు ఒక బిలియన్ డాలర్స్ కు పైగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూనే, మరోవైపు యాక్సెంచర్‌ AI సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో AI ప్రాజెక్టుల ద్వారా 5.1 బిలియన్ల డాలర్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని సంస్థ తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా పేర్కొంది. సంస్థకు ప్రస్తుతం 77,000 మంది AI, డేటా నిపుణులు ఉన్నారని.. ఇది రెండు సంవత్సరాల క్రితం ఉన్న 40,000తో పోలిస్తే దాదాపు రెట్టింపు అని వెల్లడించారు.

Sohani Kumari: నటి కాబోయే భర్త ఆత్మహత్య.. తప్పు చేశానంటూ సెల్ఫీ వీడియో

ఈ పరిణామాలు కన్సల్టింగ్, ఐటీ సేవల రంగంలో విస్తృతమైన మార్పులను సూచిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు తమ బడ్జెట్‌లను తగ్గిస్తుండటం, అదే సమయంలో AIతో కూడిన సామర్థ్యాలు పెరగడం వల్ల యాక్సెంచర్‌ తన కార్యకలాపాలను మార్చుకుంటోంది. తక్కువ మంది, కానీ ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులతో తన క్లయింట్లను కొనసాగించగలమని ఆక్సెంచర్ నమ్ముతోంది. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.

Exit mobile version