NTV Telugu Site icon

ACB Raids: మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా సొమ్ము స్వాధీనం

New Project (50)

New Project (50)

సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో తొమ్మిది గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 8చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఉమామహేశ్వరరావు బంధువులు స్నేహితుల నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇబ్రహీం పట్నం ఏసీపీగా ఉన్న సమయంలో ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు, సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాదితులకు అన్యాయం చేశాడని పలువురు అన్నారు. సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, లాండ్ పత్రలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.

READ MORE: Uttarakhand: పోలీసులను చూసి పరుగో పరుగు పెట్టిన వ్యక్తి.. ఇంతకీ అలా ఎందుకు చేశాడు..?

సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అశోక్ నగర్ లోని ఉమా మహేశ్వరరావు నివాసంలో రూ. 2,50,000 నగదు సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 2 బ్యాంక్ లాకర్ గుర్తించారు. వాటిని ఓపెన్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఉమా మహేశ్వరరావు బ్యాంకు లాకర్ వివరాలు వెల్లడించేందుకు సహకరించని పరిస్థితి. గడిచిన 10 గంటల సోదాల్లో 8కి పైగా ల్యాండ్ పత్రాలు గుర్తించారు. ల్యాండ్ పత్రాలు ఎవరెవరు పేరుపై ఉన్నాయి.. వాటి వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు సోదాల అనంతరం ఏసీబీ అధికారులు తెలియజేయనున్నారు. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాటిని ఓపెన్ చేసేందుకు యత్నిస్తున్నారు.