Site icon NTV Telugu

HMDA Ex Director: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో భారీగా బయటపడుతున్న ఆస్తులు..

Hmda

Hmda

ACB raids: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తించారు. నగలు నగదు ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నానక్ రామ్ గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా.. హైదరాబాద్ లో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Astrology: జనవరి 25, గురువారం దినఫలాలు

మొత్తం 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, మిత్రులు కంపెనీలో సోదాలు చేస్తున్నారు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం చేసుకోగా.. 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు.. పెద్ద మొత్తంలో ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాల, జనగామలో 24 ఎకరాల లాంటి పత్రాలు స్వాధీన పరుచుకున్నారు. భూములు అన్ని కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అలాగే, బాలకృష్ణ బినామీలను కూడా ప్రశ్నిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Read Also: New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీల ఆర్థిక స్థోమతపై వెరిఫై చేస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. బాలకృష్ణను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం.. ఇవాళ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. పలు కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నట్లుగా గుర్తింపు.. హెచ్ఎండీఏ డైరెక్టర్ తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించిన బాలకృష్ణ.. రేరాలో సెక్రెటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్స్ సంస్థలకు లబ్ధి చేకిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుటి వరకు ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలను పూర్తిగా వెరిఫై చేస్తున్నాం.. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఏసీపీకి సహకరించలేదు.. బాలకృష్ణను కోర్టులో హాజరుపర్చిన తిరిగి కస్టడీలోకి తీసుకుంటాం.. బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలకే సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Exit mobile version