NTV Telugu Site icon

Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు

Abrar Ahmed

Abrar Ahmed

Abrar Ahmed Funny Moment with Sadeera Samarawickrama in SL vs PAK 1st Test: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన, ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. ప్లేయర్స్ తెలిసి, తెలియక చేసిన పొరపాట్లు తెగ నవ్వులు పూయిస్తాయి. కొన్ని సంఘటనలు అయితే క్రికెటర్లతో పాటు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అలాంటి ఫన్నీ ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్‌లో బ్యాటర్‌ షాట్ ఆడిన తర్వాత బంతి ఇవ్వను అని మారాం చేసిన ఘటన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

శ్రీలంకలోని గాలె స్టేడియం వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 312 పరుగులకు ఆలౌట్ అయింది. ఆపై పాక్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసింది. క్రీజులో అబ్రార్ అహ్మద్, సౌద్ షకీల్ ఉన్నారు. లంక స్పిన్నర్ రమేష్ మెండిస్ 120వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్లోని నాలుగో బంతిని అబ్రార్ డిఫెన్స్ ఆడాడు. ఆ బాల్ బాగా టర్న్‌ అయి అతని గ్లవ్‌ను తాకి ప్యాడ్‌లో ఇరుక్కుంది. అది చూసిన లంక వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ బంతిని తీసుకునేందుకు వచ్చాడు.

Also Read: Kohli-Sachin: అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ!

అయితే అబ్రార్ అహ్మద్.. సదీర సమరవిక్రమని బంతిని తీసుకునే అవకాశం ఇవ్వలేదు. అతడిని పక్కకు తోసేస్తూ.. తన ప్యాడ్లోని బంతి అందకుండా తప్పించుకున్నాడు. అలా కొద్దిగా ముందుకు వచ్చేశాడు. ఈ క్రమంలో బంతి అబ్రార్ ప్యాడ్‌లో నుంచి కిందపడిపోతుంది. ఇది గుర్తించిన వెంటనే అబ్రార్.. సమరవిక్రమ త్రో వేయకముందే క్రీజులోకి వెళ్లిపోతాడు. ఈ ఘటన చూసి మైదానంలోని ప్లేయర్స్, స్టేడియంలోని ఆటగాళ్లతో సహా ఫాన్స్ తెగ నవ్వుకున్నారు.

అబ్రార్ అహ్మద్ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అబ్రార్ చేసిన పనికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మరోవైపు ఇరు జట్ల ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ కూడా పగలపడి నవ్వుకున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూస్తే మీరు కూడా పడి పడి నవ్వుకుంటారు.

Also Read: Hero Xtreme 200S 4V Launch: హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!