Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!

Abhishek Sharma Form

Abhishek Sharma Form

Abhishek Sharma: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, అభిషేక్ శర్మ గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ బ్యాట్ నుంచి కొత్త మెరుపులు, సరికొత్త రికార్డులు నమోదు అవుతాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రతీ మ్యాచ్‌లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఈ ప్రపంచ కప్‌లో తన పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ మూడు బంతుల్లో డకౌట్ అయ్యి ఖాతా తెరవలేకపోయాడు. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ ఇప్పటి వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు, నిజానికి ఇది అతని వరుస మూడో డకౌట్. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ ఖాతా ఓపెన్ చేయలేదు.

READ ALSO: Maruti E Vitara కార్ల ధరల ప్రకటన.. ఏ వేరియంట్‌కు ధర.. ఎంతంటే..?

వరుసగా మూడోసారి డకౌట్..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో అభిషేక్ శర్మ వరుస అవుట్లు ప్రారంభమయ్యాయి. USA తో జరిగిన మ్యాచ్‌లో శర్మ తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అతను అనారోగ్యానికి గురై నమీబియాతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే, కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి మైదానంలోకి దిగిన అభిషేక్, కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరువకుండానే ఔట్ అయ్యాడు. ఇప్పుడు, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మళ్లీ ఖాతా తెరవలేకపోయాడు, కేవలం మూడు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా మైదానం విడిచి వెళ్లాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ జెర్సీ ధరించి బ్యాటింగ్‌కు వచ్చాడు. అలా ఎందుకు చేశాడో తెలియదు.. అభిషేక్ శర్మ ఏదైనా ట్రిక్ ప్లే చేశాడా లేదంటే కేవలం అనుకోకుండా అలా సిరాజ్ జెర్సీ ధరించి వచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ ఖాతా తెరవలేకపోయాడు. నిజంగా ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

READ ALSO: Satyadev New Movie: అనిల్ రావిపూడి చేతుల మీదుగా సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం..