రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

  • అభిషేక్ శర్మ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన..
  • 25% మ్యాచ్ ఫీజు జరిమానా విధింపు
  • ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా
  • ఆర్టికల్ 2.3 ప్రకారం లెవల్ 1 నేరం నమోదు
  • IPL క్రమశిక్షణ నిబంధనల ప్రకారం చర్యలు..
Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బాట్స్మెన్ అభిషేక్ శర్మకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) షాక్ ఇచ్చింది. గురువారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్‌ ను కూడా జత చేసింది.

Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆట పరంగా అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో మాత్రం అతని ప్రవర్తన అధికారులను నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం (మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడటం) లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ ఒప్పుకున్నాడు.

ఐపీఎల్ క్రమశిక్షణ ఫ్రేమ్‌వర్క్‌లో లెవల్ 1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవిగా పరిగణించబడతాయి. అయినా పదేపదే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే డీమెరిట్ పాయింట్లు పెరుగుతాయి. వీటివల్ల భవిష్యత్తులో మ్యాచ్‌ ల నుండి కూడా సస్పెన్షన్‌ కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభిషేక్ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ శిక్షను ఖరారు చేశారు. ఇక ఈ వివాదాల సంగతి పక్కన పెడితే మైదానంలో మాత్రం ఆరెంజ్ ఆర్మీ జట్టు అద్భుత ప్రదర్శన కనపరిచింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది.

Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ కు దిగిన హైదరాబాద్‌కు ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ (48) కేవలం 34 బంతుల్లోనే 82 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (52) హాఫ్ సెంచరీతో, నితీష్ కుమార్ రెడ్డి (39) కీలక పరుగులు జోడించడంతో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఇక 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రఘువంశీ (52) మినహా ఎవరూ రాణించలేదు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఈషాన్ మలింగ చెరో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.