Site icon NTV Telugu

Abhishek Bachchan: కొత్త హెయిర్‌ స్టైల్‌ వెనుక అసలు రహస్యం ఇదే!

Abhishek Bachan

Abhishek Bachan

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరియు స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ (King). ‘పఠాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో షారుక్ ఖాన్ సరసన ఆయన కుమార్తె సుహానా ఖాన్ మరియు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో అభిషేక్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రకు ఎంపికవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : David-Reddy-1: ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్‌లో స్పెషల్ గెస్ట్ రోల్.. ఎవరు ఆ స్టార్?

గత కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్ ఒక విభిన్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపిస్తూ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటని అభిమానులు చర్చించుకుంటున్న తరుణంలో, అభిషేక్ బచ్చన్ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తను కనిపిస్తున్న ఈ కొత్త లుక్ కేవలం షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కోసమేనని ఆయన తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘కభీ అల్విదా నా కెహనా’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన షారుక్ – అభిషేక్, చాలా కాలం తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ‘రావణ్’ సినిమాలో తన నటనతో మెప్పించిన అభిషేక్, ఇప్పుడు ‘కింగ్’ లో విలన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలో సత్తా చాటుతారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version