NTV Telugu Site icon

అమెరికా డ్రోన్ దాడుల్లో సీనియర్‌ అల్‌ఖైదా నాయకుడు మృతి

అమెరికా మిలటరీ సిరియాలో జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన సీనియర్‌ లీడర్‌ అబ్దుల్‌ హామీద్‌ అల్‌ మాతర్‌ మృతి చెందినట్టు అమెరికా మిలటరీసెంట్రల్ కమాండ్ కు చెందిన యూఎస్‌ ఆర్మీ మేజర్‌ జాన్‌ రిగ్స్‌బీ తెలిపారు. అబ్దుల్‌ హామీద్‌ అల్‌ మాతర్‌ ప్రపంచవ్యాప్తంగా అల్‌ఖైదా చేపట్టిన దాడుల్లో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు.

అమెరికాలో భారీ దాడులు చేసేందుకు పన్నాగం పన్నాడన్నారు. రెండు రోజుల కిందట దక్షిణ సిరియాలోని అమెరికా మిలటరీ ఔట్‌పోస్ట్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ డ్రోన్‌ దాడులు నిర్వహించారా లేదా అమెరికా డ్రోన్‌లపై దాడి చేసినందుకు ఈ దాడులు చేశారా అనేది జాన్‌ రిగ్స్‌బీ చెప్పలేదు.