Site icon NTV Telugu

Naa Saami Ranga : నా సామి రంగా.. వరలక్ష్మి పాత్రలో ఆషికా రంగనాథ్ మెరిసిపోతుందిగా..

Whatsapp Image 2023 12 04 At 2.33.37 Pm

Whatsapp Image 2023 12 04 At 2.33.37 Pm

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. రీసెంట్ గా ఈ మూవీ కి సంబంధించి నాగార్జున లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసారు.దాని తర్వాత ‘నా సామిరంగ’ నుండి ఎలాంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.‘నా సామిరంగ’లో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు. అయితే నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో తన సినిమాలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ అక్కడే గ్లింప్స్ ను కూడా లాంచ్ చేశారు. ఆ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ గ్లింప్స్ లో ‘మా వరలక్ష్మిని మీకు పరిచయం చేస్తున్నాం’ అని చెప్తూ ఆషికాను చూపించారు. ‘నా సామిరంగ’లో ఆషికా “వరలక్ష్మి “పాత్రలో అలరించబోతుంది.

అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా వోణి లో ఆషికా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..హీరోయిన్ ఇంట్రోతో పాటు ఈ గ్లింప్స్ లో ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడాచిత్ర యూనిట్ జతచేసింది.నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ‘నా సామిరంగ’కు ఆస్కార్ అవార్డ్ గ్రహిత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే’ పాటను త్వరలోనే విడుదల చేస్తామని మూవీ టీమ్ తాజాగా అప్డేట్ ఇచ్చింది. ‘నా సామిరంగ’ అనేది కేవలం ఒక కమర్షియల్ చిత్రం మాత్రమే కాకుండా ఇందులో ఒక క్లాసిక్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని నాగార్జున ఇప్పటికే రివీల్ చేశారు. ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ‘నా సామిరంగ’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి కథ మరియు డైలాగులు అందించారు.అయితే ఈ చిత్రంలో ఇతర నటీనటుల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశకు చేరిందని నాగార్జున తెలిపారు.

https://youtu.be/Td54gOFYw_0?si=nV-SsQ5XMMGmbIdQ

Exit mobile version