Site icon NTV Telugu

Aaru Sethulunnaa Video Song: సలార్ సినిమాకే హైలైట్.. ‘ఆరు సేతులున్నా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!

Aaru Sethulunnaa Video Song

Aaru Sethulunnaa Video Song

Video Song of Aaru Sethulunnaa Out From Prabhas Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్​ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సలార్’. శృతి హాసన్ హీరోయిన్‌గా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ నటి శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. సలార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పింది. 2023లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆరేళ్ల తరువాత ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో ఆయన ఫాన్స్ ఆనందంలో తేలియాడారు.

సలార్ సినిమా ప్ర‌స్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో కూడా భారీ వ్యూస్ సాధించింది. సలార్ సినిమాకు హైలైట్‌గా నిలిచిన ‘ఆరు సేతులున్నా’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ‘ఆరు సేతులున్నా గాని ఆదుకొను సెయ్యి రాదమ్మా యా.. యా.. యా.. యా, గుక్కపెట్టి రంది ఉంటే ఎడ జాడ కానరావమ్మ యా.. యా.. యా.. యా’ అంటూ ఈ పాట సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ముందు వచ్చే ఈ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన రెండు గంటల్లో 35 వేలకు పైగా వ్యూస్ సాధించింది.

Also Read: Jack Movie: ‘జాక్’గా వ‌స్తున్న సిద్ధు జొన్నలగడ్డ!

ఖాన్స‌ర్‌లో చిన్న పిల్లలని కూడా చూడకుండా.. విలన్ ఆడపిల్లలను అత్యాచారం చేస్తుంటాడు. అక్కడ ఉన్నవారందరూ కాటేరమ్మ దైవం వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో దేవా (ప్రభాస్) వచ్చి వారిని అంతమొందిస్తాడు. ఆ సమయంలో ఈ పాట వ‌స్తుంది. ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ ఆలపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అయింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిర్గందూర్ సలార్ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version