NTV Telugu Site icon

AAP: జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

Aap

Aap

AAP became a national party: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చరిత్ర సృష్టించింది. జాతీయ పార్టీ హోదాను సంపాదించుకుంది. గుజరాతీల ఓట్లే ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం అన్నారు. ‘‘ గుజరాత్ ప్రజల ఓట్లతోనే నేడు ఆప్ జాతీయపార్టీగా అవతరిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో విద్యా, ఆరోగ్య రాజకీయాలతో ముద్ర వేస్తున్నామని.. ఇందుకు దేశానికి అభినందనలు అని ఆయన అన్నారు. ఆప్ జాతీయ ఆశయాలకు “జాతీయ పార్టీ” అనే ట్యాగ్ మరింత బూస్ట్ ని ఇస్తుందని ఆయన అన్నారు.

Read Also: Punjab: భారత జవాన్‌ను నిర్భంధించిన పాకిస్తాన్

ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గోవాలో కూడా ఆప్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో కూడా తన ముద్రను వేసింది. దాదాపుగా ఆరు స్థానాలను గెలిచే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆప్ జాతీయ హోదా పొందినట్లు అయింది. ఓ పార్టీ జాతీయ హోదా పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లతో రాజకీయపార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6 శాతం ఓట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్ నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాప్రతినిధులను కలిగి ఉంది. దీంతో జాతీయ పార్టీ హోదాకు లైన్ క్లీయర్ అయింది.

ఢిల్లీతో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఒక రోజు క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆప్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ ఇచ్చింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసింది.

Show comments