Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో `కూలీ`సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శర వేగంగా కొనసాగుతుంది. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రజనీ కాంత్-నాగార్జునలను ఒకే ప్రేమ్ లో చూసే అవకాశం రావడంతో ఇద్దరి హీరోల అభిమానులు సినిమా చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇదే చిత్రంలో మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు దీని గురించి మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన కూడా తను నటిస్తున్నానన్న విషయాన్ని చెప్పలేదు. నటించడం లేదని ఎక్కడా కూడా ఖండించను లేదు. దీంతో అప్పటి నుంచి అమీర్ ఎంట్రీ అన్నది సస్పెన్స్ గానే మారింది. తాజా సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించి షూటింగ్ కు కూడా హాజరవుతున్నారట. సినిమాలో ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సినిమాను మలుపు తిప్పే పాత్ర అదని లోకేష్ మార్క్ లో ఆ పాత్రను పరిచయం చేస్తాడని అంటున్నారు.
Read Also:Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
త్వరలోనే దీనికి సంబంధించి చిత్ర దర్శక, నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వస్తుందని వినిపిస్తుంది. స్టార్ హీరోల చిత్రాల్లో నటించడానికి అమీర్ ఖాన్ కి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆయన ఎంతో డౌన్ టూ ఎర్త్. దక్షిణాది నటీనటులతో ఎంతో స్నేహంగా మెలుగుతారు. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున అయనకు ఎంతో మంచి మిత్రులు. అమీర్ నటించిన సినిమాలన్నీ హైదరాబాద్ లో ప్రమోట్ చేయాలంటే చిరు, నాగార్జున రంగంలోకి దిగుతారు. కోలీవుడ్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా మంచి స్నేహం ఉంది. ఇప్పుడా స్నేహం కారణంగా లోకేష్ ఆఫర్ ని అమీర్ ఖాన్ అంగీకరించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ,సౌబిన్ షాహిర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
Read Also:(no title)