NTV Telugu Site icon

Aamir Khan : తన అభిమానులకు శుభవార్త చెప్పిన అమిర్ ఖాన్..ఆ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ..

Whatsapp Image 2023 08 29 At 7.59.00 Pm

Whatsapp Image 2023 08 29 At 7.59.00 Pm

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా గుర్తింపు పొందాడు ఆమిర్ ఖాన్. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తన సినీ కెరీర్లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన నటించిన రెండు సినిమాలో దారుణంగా ఫ్లాప్స్ అవ్వడంతో ఆమిర్ ఖాన్ నిరాశ చెందారు.. గత సంవత్సరం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ గా నిలిచింది. లాల్ సింగ్ చద్దా మూవీ ప్లాప్ అవ్వడంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ఆమిర్ ఖాన్ ప్రకకటించారు.ఆ చెప్పిన ఏడాది పూర్తవడం తో మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. తన సొంత ప్రొడక్షన్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ లోనే ఆమిర్ కమ్‌బ్యాక్ మూవీనీ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు.

ఏడాది పాటు సినిమాల కు బ్రేక్ తీసుకోని అమిర్ ఖాన్ కుటుంబం తో ఆనందంగా గడిపాడు. ఇప్పుడు తన తర్వాత సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టాడు.. సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.ఆయన నటించే తాజా సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దంగల్ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన ఆమిర్ ఖాన్ కు గత కొన్నేళ్లుగా అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ మూవీకి రీమేక్ గా వచ్చిన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్ర లో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని ఆమిర్ ఖాన్ భావిస్తున్నాడు.