ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అందుకున్న సంగతి తెలిసిందే. 68 ఏళ్ల సినీ చరిత్రలో ఏ తెలుగు హీరోకి దక్కని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది.దీంతో ఆయనకు పలువురు సినీ సెలబ్రెటీలు మరియు రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.అల్లు అర్జున్ ప్రతి మూమెంట్ నీ తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తన ఇన్ స్టా స్టోరీలో ఫ్యాన్స్ కోసం సంథింగ్ స్పెషల్ ఉండనుందని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ చెప్పబోయే స్పెషల్ న్యూస్ ఏంటా అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ తన ఇన్ స్టాలో ఓ స్పెషల్ వీడియో ను షేర్ చేశారు. అందులో తన వన్ డే లైఫ్ ఎలా ఉంటుందో చూపించారు.
ఆ వీడియోలో అల్లు అర్జున్ హోం టూర్ కూడా చేశారు. మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి సాయంత్రం వరకు తాను ఏమేం చేస్తారనేది చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం ఆ తరువాత షూటింగ్లో పాల్గొనడం వంటి విషయాలను చూపించారు. అలాగే ఆ వీడియోలో పుష్ప షూటింగ్ సెట్ లొకేషన్స్, హీరో క్యాస్టూమ్స్ మరియు కేరవాన్, ప్రాపర్టీస్ అన్నింటిని చూపించారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అల్లు అర్జున్ తెలిపారు.ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 లో మరిన్ని సర్ప్రైసెస్ ఉండనున్నాయని సమాచారం. పుష్ప 1 పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. త్వరలో రాబోయే పుష్ప 2 పాన్ ఇండియా స్థాయి మాత్రమే కాదు గ్లోబల్ స్థాయి చేరుకుంటుందని ఇటీవల అల్లుఅర్జున్ తెలిపారు.. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేసింది. ఇందులో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయనున్నట్లు సమాచారం.
