NTV Telugu Site icon

Aalavandhan OTT: 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న కమల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Alavandn

Alavandn

తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వయసు పెరుగుతున్నా కూడా ఎక్కడ తగ్గేదేలే అంటున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు.. అయితే తాజాగా ఈయన నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో 23 ఏళ్ల తర్వాత రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..

కమల్ హాసన్ తమిళ్ మూవీ ‘ఆళవందన్’ ఏకంగా థియేటర్లలో రిలీజ్ అయిన 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ శుక్రవారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటి ఆడియన్స్ కోసం 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు.. 2001 లో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు మళ్ళీ ఓటీటీలో చూడొచ్చు.. ఇక ఈ మూవీలో కమల్ డ్యూయల్ రోల్ చేశాడు.. అప్పటిలో ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆర్మీ ఆఫీసర్గా.. సైకో కిల్లర్గా కమల్ హాసన్ సినిమాలో నటించాడు. ఈ సినిమాకి సురేష్ కృష్ణ తరస్కత్వం వహించారు. ఎక్స్పెరిమెంటల్ మూవీ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయింది.. ఈ సినిమా తర్వాత కామల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాడు.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారతీయుడు 2 సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుందని సమాచారం..

Show comments