NTV Telugu Site icon

Akash Chopra: ముందు మీ దేశంలో సిరీస్ గెలవండి: పాక్ ఫ్యాన్స్‌కు ఆకాశ్ చోప్రా పంచ్

6

6

స్వదేశంలో టీమిండియాను ఓడించడం అంత తేలిక కాదన్న విషయం తెలిసిందే. టాప్ క్రికెట్ దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ ఇలా ప్రతి జట్టుకు ఇండియాను సొంతగడ్డపై ఓడించడం అనేది కలగానే మిగిలిపోతోంది. ఇక టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టే.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించేందుకు 19 ఏళ్లుగా శ్రమిస్తోంది. అప్పుడెప్పుడో 2004లో చివరి సారిగా గెలిచిన ఆసీస్.. ఈ సారి ఆ ముచ్చట తీర్చుకోవాలనే కసితో ఉంది. విదేశాల్లో మన ప్రదర్శన ఎలా ఉన్నా స్వదేశంలో భారత్‌ను ఓడించడం అనేది శక్తికి మించిన పని. అయితే ఈ అగ్రదేశాల వల్ల కాని పనిని పాకిస్తాన్ చేస్తుందని, సొంతగడ్డపై భారత్‌ను ఓడించే సత్తా పాక్‌కే ఉందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. కాగా దీనికి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Also Read: Murali Vijay: దక్షిణాది క్రికెటర్స్ అంటే ఎందుకు వివక్ష: మంజ్రేకర్‌కు విజయ్‌ కౌంటర్

బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా ఓ ఒపినీయన్ పోల్ పెట్టగా పాక్‌కు చెందిన ఓ అభిమాని “సొంతగడ్డపై టీమిండియాను ఓడించే సత్తా పాకిస్తాన్‌కు మాత్రమే ఉంది” అని బదులిచ్చాడు. ఈ రిప్లైకు స్పందించిన ఆకాశ్ చోప్రా అదిరిపోయే కౌంటరిచ్చాడు. “నీ పాజిటివ్ దృక్పథం చూస్తుంటే ముచ్చటేస్తుంది బ్రదర్.. కానీ నువ్వు అసలు విషయం మరిచిపోయినట్టున్నావ్. ముందు పాక్‌ను సొంతగడ్డపై సిరీస్ గెలవమను. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే పాక్ ఓటమిపాలైంది. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ చేతిలోనూ చిత్తయ్యింది. ఈ సిరీస్‌ల్లో మీరు గెలిచుంటే ఇప్పటికే పాకిస్తాన్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరేది” అని వరుస ట్వీట్లు చేశాడు. దాంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చోప్రా ఇచ్చిన కౌంటర్‌కు భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘అవును చోప్రా భయ్యా.. కరెక్ట్‌గా చెప్పారు.. విదేశీ జట్లు వాళ్ల దేశానికి వస్తే సిమెంట్ రోడ్లున్న పిచ్‌లను తయారుచేసి అబాసు పాలవుతున్న పాకిస్తాన్ మనకు నీతులు చెబుతోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.