Site icon NTV Telugu

Aadhar-PAN Link Penalty Increase: ఆధార్ పాన్ లింక్ గడువు ముగిస్తే.. తర్వాత పెనాల్టీ బాదుడే

Aadhar Pan Link

Aadhar Pan Link

Aadhar-PAN Link Penalty Increase: పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. దీనికి కేంద్రం మొదట గడువు మార్చి 31గా నిర్ణయించింది. అయినా చాలా మంది లింక్ చేసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పాన్ ఆధార్ లింక్ డెడ్‌లైన్ పొడిగించింది. ఈ గడువు ముగిసిన తర్వాత మళ్లీ లింక్ చేసుకోవాలంటే భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హెచ్చరించారు. అందుకే పాన్ కార్డ్ హోల్డర్స్ సమయం దొరికినప్పుడు ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలన్నారు.

Read Also: Allu Arjun: సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఎత్తిన ప్రతి వేలు ముడుచుకునేలా చేశాడు…

ప్రభుత్వం ఇప్పటికే పాన్-ఆధార్ లింకింగ్ గడువును మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించింది. పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు ముగిసిన తర్వాత మాత్రమే పెనాల్టీ మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇందుకు ఇంకా సమయం ఉందన్నారు. మార్చి 31, 2022 వరకు ఆధార్-పాన్ లింక్ ఉచితంగా చేసుకోవచ్చన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుండి రూ. 500 ఆలస్య రుసుం విధించబడింది. దీనిని జూలై 1, 2022 నుండి రూ. 1000కి పెంచారు. ఇది కాకుండా, జూన్ 30 లోపు ఆధార్‌ను లింక్ చేయకపోతే పాన్ కార్డ్ పనిచేయదని కూడా చెప్పారు.

Read Also: Today Business Headlines 08-04-23: బిజినెస్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. మరిన్ని వార్తలు

ఆదాయపు పన్ను చట్టం-1961 నిబంధనల ప్రకారం.. జూలై 1, 2017న పాన్ జారీ చేయబడిన ప్రతి వ్యక్తి, ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్న ప్రతి వ్యక్తి అంతకు ముందు నిర్ణీత రుసుమును చెల్లించాలని ప్రకటనలో పేర్కొంది. మార్చి 31, 2023 ఇలా చేసిన తర్వాత లింక్ చేయడం చాలా ముఖ్యం. అలా చేయడంలో విఫలమైతే ఏప్రిల్ 1 నుండి ఈ చట్టం ప్రకారం జరిమానా మొత్తం పెరుగుతుంది. దీని తర్వాత, ప్రభుత్వం మార్చి 31 చివరి తేదీ కంటే ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది.

Exit mobile version