Site icon NTV Telugu

Aadhaar: యుఐడిఎఐ బిగ్ అలర్ట్.. ఆధార్ కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్!.. వెంటనే ఈ పని చేయండి!

Aadhar

Aadhar

ఆధార్ కార్డ్ తో అనేక ప్రయోజనాలు పొందే వీలుండడంతో అత్యంత ముఖ్యమైన దృవీకరణ పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్స్ ప్రయోజనాలను పొందడానికి అవసరం. అయితే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆధార్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈనేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ ఇచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పిల్లల ఆధార్ కార్డు అంటే బాల్ ఆధార్ కోసం ఈ హెచ్చరికను జారీ చేసింది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్ డేట్ తప్పనిసరిగా చేయాలని సూచించింది.

Also Read:Vishal : థియేటర్ రివ్యూలు ఆపండి.. విశాల్ సంచలన డిమాండ్

యుఐడిఎఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ పాఠశాల అడ్మిషన్, ప్రవేశ పరీక్ష, స్కాలర్‌షిప్ ప్రయోజనాలను సులభంగా పొందటానికి వీలు కల్పిస్తుందని వారికి తెలిపింది. దీనితో పాటు, 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ సకాలంలో చేయకపోతే, అతని ఆధార్‌ను డీయాక్టివేట్ చేయవచ్చుని సంబంధిత అధికారులు తెలిపారు. 5-7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ లేదా MBU ప్రక్రియ ప్రస్తుతం ఉచితం అని UIDAI స్పష్టంగా చెప్పింది, అంటే, దీనికి ఎటువంటి ఫీజు వసూలు చేయరు. 7 ఏళ్ల వయసు తర్వాత, అప్ డేట్ చేయడానికి రూ.100 ఫీజు చెల్లించాలి.

Also Read:Indigo Flight: ఇండిగో ఫ్లైట్‌ గాల్లో ఉండగా ఇంజిన్‌ ఫెయిల్‌.. ‘పాన్ పాన్ పాన్’ అంటూ పైలట్ కాల్..

0–5 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల ఆధార్ కార్డును బయోమెట్రిక్ లేకుండా తయారు చేస్తారు. దీనికి పిల్లల ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, తల్లిదండ్రుల పత్రాలు మాత్రమే అవసరం. అయితే ఈ వయోపరిమితి వరకు బయోమెట్రిక్ అవసరం లేదు. అయితే, పిల్లవాడికి 5 సంవత్సరాల వయస్సు పూర్తయినప్పుడు, మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్‌గా అతని వేలిముద్ర, ఐరిస్ స్కాన్, తాజా ఫోటోను అప్‌డేట్ చేయడం అవసరం. పిల్లలకు జారీ చేసే ఆధార్ కార్డును ‘బాల్ ఆధార్’ అని కూడా అంటారు.

Exit mobile version