Aadhaar App Alert: ఇటీవల UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ ను లాంచ్ చేసిన సంగతి విధితమే. ఈ యాప్ ద్వారా పేపర్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా.. ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ UIDAI తన అధికారిక X అకౌంట్ ద్వారా వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ ఐడెంటిటీని సురక్షితంగా ఉంచేందుకు, ఆన్‌లైన్ మోసాలను అడ్డుకునేందుకు 5 ముఖ్యమైన మార్గాలను UIDAI సూచించింది.
ఆధార్ కార్డును ఎందుకు కాపాడుకోవాలి?
మీ ఆధార్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కితే.. ఆన్‌లైన్ ఫ్రాడ్, సైబర్ మోసాలు, స్కామ్‌లకు ఉపయోగించే ప్రమాదం ఉంది. ఆధార్ అనేది అనేక కీలక సేవలకు గేట్‌వే లాంటిదని UIDAI చెబుతోంది. అందుకే దీనిని ఎప్పుడూ సురక్షితంగా ఉంచాలని సూచిస్తోంది.
వన్ ప్లస్ ధమాకా ఆఫర్.. 7100mAh బ్యాటరీతో రానున్న కొత్త ఫోన్.. రూ. 25 వేలకే.!
ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయవద్దు..
మీ ఆధార్‌కు సంబంధించిన OTP (One-Time Password) ను ఎవరితోనూ షేర్ చేయకండి. ఆధార్ OTP షేర్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. OTP లేకుండా మీ ఆధార్ వివరాలను ఎవరూ యాక్సెస్ చేయలేరు.
మాస్క్డ్ ఆధార్ కార్డ్:
అనేక పథకాలు, సేవల్లో ఆధార్ అవసరం అవుతుంది. ముఖ్యమైన సేవల కోసం మాస్క్డ్ ఆధార్ (Masked Aadhaar) కార్డ్ వాడాలని UIDAI సూచిస్తోంది. ఇందులో మీ 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. ఇందులో కొన్ని అంకెలు మాత్రమే కనపడుతాయి. దీనివల్ల మీ ఆధార్ నంబర్ గోప్యంగా ఉంటుంది. ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ లభిస్తుంది.
ఫింగర్‌ప్రింట్ లాక్ చేయండి:
UIDAI యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్‌పై “ఫింగర్ ప్రింట్ లాక్”ను యాక్టివేట్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఆధార్‌కు లింక్ అయిన ఫింగర్‌ప్రింట్, ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ డేటా లాక్ అవుతుంది. దాంతో ఎవరైనా దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు.
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు:
సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో మీ ఆధార్ కార్డు ఫోటోలను పోస్ట్ చేయవద్దని UIDAI హెచ్చరిస్తోంది. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలు ఇతరులకు చేరే ప్రమాదం ఉంటుంది.
హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించండి:
మీరు ఇప్పటికే మోసం లేదా సైబర్ క్రైమ్‌కు గురయ్యుంటే, వెంటనే చర్యలు తీసుకోండి. ఇందుకోసం UIDAI హెల్ప్‌లైన్ 1947 నెంబర్ కు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్లకు వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
