Site icon NTV Telugu

Visakhapatnam: ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి..

Ap News

Ap News

ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్నేళ్లుగా ఈమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో విసుగు చెందిన యువతి పొలాల్లో జల్లడానికి ఇంట్లో భద్రపరిచిన పురుగుల మందును ఈనెల 16వ తేదీ సాయంత్రం తాగింది. ఇంట్లోని వారు గమనించి తగరపువలస ఎన్నారై ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మృత్యువుతో పోరాడుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది.

READ MORE: Maharashtra: ఆరు నెలల్లోనే భారీ మార్పు.. “మహాయుతి” విజయంలో ఆర్‌ఎస్ఎస్ పాత్ర ఏంటి?

శుక్రవారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. యువతి మృతికి కారకుడైన రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కుటుంబీకులు జాగ్రత్త పడ్డారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.

Exit mobile version