AP Student Killed in USA : అమెరికాలో డల్లాస్ లోని ఓ స్టోర్ లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు . ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) అమెరికాలోని దుండగుడి కాల్పల్లో మరణించాడు. గోపీకృష్ణ జీవనోపాది కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అర్కెన్సాస్ రాష్ట్రంలని సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా, ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాలతో గోపీకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. ఏపీ యువకుడు మృతి
- అమెరికాలో ఏపీ యువకుడిపై కాల్పులు
- బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ