NTV Telugu Site icon

Viral Video: యమధర్మరాజు లీవ్ లో ఉన్నట్టున్నాడు.. లైక్స్ కోసం క్రేజీ స్టంట్ చేసిన యువకుడు

Sketing

Sketing

Viral Video: ప్రస్తుతం చాలా మందికి సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఏవేవో చేస్తున్నారు. రకరకాల గెటప్ లు. విభిన్నమైన మాట తీరుతో కూడా చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇది చేస్తేనే క్లిక్ అవుతారు అనేది ఏమి లేదు. కొంతమంది మంచి పనులు చేస్తూ ఫేమస్ అవడానికి చూస్తూ ఉంటే మరికొంతమంది ప్రాణాంతకమైన స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి స్టంట్స్ చేసి చాాలా మంది ప్రాణాలు కోల్పొయారు. రైలు దగ్గర స్టంట్స్ చేయబోయి చాలా మందికి ట్రైన్ యాక్సిడెంట్ అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇక బైక్ పై స్టంట్స్ చేయబోయి చాలా మంది ప్రాణాలు కోల్పొయారు. అంతేకాకుండా ఎత్తుల నుంచి దూకడం లాంటవి చేసి కూడా ఆసుపత్రి పాలయ్యారు. అలాంటి భయంకరమైన స్టంట్ నే ఓ అబ్బాయి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఫేమస్ అవడం కోసం పైకి పోయే పనులు చేయాలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Viral Video: వీడియో.. కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన వీధి కుక్క

ఇక ఈ వీడియోలో ఓ యువకుడు సినిమాలో కూడా లేని విధంగా స్కేటింగ్ షూ వేసుకొని ఓ పెద్ద లారీ రెండు టైర్ల మధ్యలో వెళుతున్నాడు. అతని ముందు వెనుక కూడా పెద్ద పెద్ద టైర్ లు ఉన్నాయి. అతను పైన ఒక దిమ్మను తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు. ఆ వాహనం చాలా వేగంగా వెళుతుంది. దీనిని సోషల్ మీడియాలో యముడు బహుశా లీవ్ లో ఉన్నాడేమో అనే క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. దీనిలో మీమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ వీడియో చూసిన వారు కూడా నిజంగానే యముడు లీవ్ లో ఉన్నట్లు ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో పోయే వాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే కొంచెం రోడ్డు బాగోకపోయిన నీ పని అంతే అంటున్నారు. షూ స్ట్రక్ అయితే పరిస్థితి ఏంటి? కొంచెం కూడా ఆలోచించవా అంటూ ఫైర్ అవుతున్నారు.

Show comments