ఈ కాలంలో ప్రేమ పేరుతో మోసం చేయడం చాలా కామన్ అయిపోయింది. ప్రేమిస్తున్నామని చెప్పి.. పెళ్లి అనే సరికి చేతులెత్తుస్తున్నారు. మరికొందరు నిజాయితీగా ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న వారు ఉన్నారు. ఈ రోజుల్లో పెళ్లి విషయంలో తల్లిదండ్రులు సంబంధాలు చూడకముందే అమ్మాయిలు, అబ్బాయిలే ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లికి ముందు అబ్బాయితో సంబంధాలు పెట్టుకోవడానికి అమ్మాయిలు ఆలోచించే వాళ్లు. కానీ ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ అని ఎంజాయ్ చేశామా.. అయిపోయిందా అన్న చందాగా మారిపోయారు. అయితే ఇప్పుడు ప్రేమ, పెళ్లి విషయం ప్రస్తావన ఎందుకొచ్చిదంటే..
Dhavaleswaram Project: ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టే ఛాన్స్
ఒక అమ్మాయి వంద మంది అబ్బాయిలతో డేటింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. ఒక్కరిద్దరింటే ఏమో కానీ.. మరీ వంద మందితో డేటింగ్ అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. బ్రిటన్ కు చెందిన అమ్మాయి 100 మంది పురుషులతో డేటింగ్ చేసిందని తన సోదరి తెలిపింది. అది కూడా కేవలం ఒక సంవత్సరంలోనే అని పేర్కొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆమె చాలా మంది పురుషులతో డేటింగ్ చేయమని ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించింది. అంతేకాకుండా 500 డాలర్లు అంటే సుమారు 41 వేల రూపాయలు కూడా ఇచ్చిందని తెలిపింది. ఇంకా డబ్బులు కావాలన్నా నిర్భయంగా అడగమని కూడా అనేదని చెప్పింది.
Explosion: బాణాసంచా గోదాంలో పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
తన సోదరి మరియు తల్లి గురించి ఈ షాకింగ్ న్యూస్ ను బయటపెట్టిన అమ్మాయి పేరు అలిస్ కరోలిన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ వీడియోలో తెలిపింది. ఇప్పటికి మిలియన్ల సార్లు చూశారు. అయితే ఆ తల్లి 100 మందితో డేట్ ఎందుకు చేయాలని కోరిందంటే.. పెళ్లి తర్వాత తన కుమార్తెకు మగవారి పట్ల ఎలాంటి భయమూ, అనుమానమూ ఉండకూడదని తెలిపింది. అందుకే వేరే పురుషులతో డేటింగ్‌కు వెళ్లమని కుమార్తెను ప్రోత్సహించింది.